మళ్లీ చారిత్రక తప్పిదం

– బెంగాల్‌లో కాంగ్రెస్‌తో తొత్తుపై ఏచూరి

న్యూఢిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి): భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచారి తేల్చిచెప్పారు. పశ్చిమబెంగాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం చారిత్రక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై బెంగాల్‌ కమిటీని వివరణ కోరామన్నారు. మతోన్మాద ఘర్షణలు సమాజానికి పెద్ద ప్రమాదమని ఆయన ఆరోపించారు. త్రిపుర సీఎం ప్రసంగాన్ని రేడియోలో ప్రసారం కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దేశంలో అత్యవరసర పరిస్థితి విధించిన సమయంలోనూ ఇలా జరగలేదని ఏచూరి దుయ్యబట్టారు. అమెరికాకు భారత్‌ జూనియర్‌ పార్ట్‌నర్‌గా తయారైందని విమర్శించారు. షాంజీ విరాసత్‌ బచావ్‌ సమ్మేళన్‌కు పొలిటికల్‌ ఎజెండా లేదన్నారు. గతంలో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీకి 3 శాతం ఓట్లు తగ్గాయని సీతారాం ఏచూరి వెల్లడించారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ బెంగాల్‌ సహా అనేకప్రాంతాల్లో సిపిఎం ఒంటరిగానే పోరాడుతుందని అన్నారు. అలాగే మోడీ అవలంబిస్తున్న విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. ఏచూరిని మరోమారు రాజ్యసభకు పంపాలన్న పార్టీ నిర్ణయాన్‌ఇన కేరళ సిఎం పనరవి విజయ్‌ వ్యతిరేకించడంతో ఆయనకు మళ్లీ అవకాశం దక్కలేదు.