మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ముంబై,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు కూడా ఏ రోజుకారోజు ఆల్‌టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లీటరు పెట్రోలు ధర మరో12 పైసలు పెరగగా, డీజిల్‌ ధర లీటరుకు 16పైసలు పైకి

ఎగబాకింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ధర సోమవారం 83.21 డాలర్ల నుంచి బ్యారెల్‌కి 85 డాలర్లకు చేరింది. త్వరలోనే బ్యారెల్‌కు 100 డాలర్లు తాకే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఆగస్టు మధ్యకాలం నుంచి పెట్రోలు లీటరుకు 6.50 రూపాయల మేరకు పెరిగాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రోజువారీ పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెంపు డాలరు మారకంలో రూపాయి విలువ అంతకంతకూ మరింత దిగజారుతోంది. దేశీయకరెన్సీ డాలరు మారకంలో సోమవారం 72.91 వద్ద ముగిసింది.