మళ్లీ వాయిదా..

– 2జీ స్పెక్టమ్ర్‌ కేసు డిసెంబర్‌ 5కు వాయిదా
న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్టమ్ర్‌ కేసులో తీర్పు వాయిదా పడింది. ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది. 2జీ స్పెక్టమ్ర్‌ అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేసిన రెండు వేర్వేరు కేసులను విచారించిన కోర్టు నవంబర్‌ 7న తుది తీర్పు వెలువరించనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే తీర్పును మరో మూడు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. యూపీఏ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో ఏ.రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళితో పాటు టెలికాం మాజీ కార్యదర్శి సిద్ధార్ధ బెహరా, ఏ.రాజా మాజీ ప్రైవేటు
కార్యదర్శి ఆర్కే చందోలియా, స్వాన్‌ టెలికాం ప్రమోటర్లు షాహీద్‌ ఉస్మాన్‌ బల్వా, వినోద్‌ గోయెంకా
తదితరులపై ఆరోపణలు ఉన్నాయి. టెలికాం సంస్థలకు 2జీ స్పెక్టమ్ర్‌ కేటాయింపు లైసెన్సులు కేటాయించడంలో రాజా పక్షపాతంతో వ్యవహరించారని, దీంతో ప్రభుత్వ ఖాజానాకు భారీ నష్టం వాల్లిందనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ./-వాన్‌ టెలికాం ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయింపులు జరిపినందుకు ప్రతిగా డీబీ గ్రూపు నుంచి డీఎంకేకు చెందిన కలంజ్ఞర్‌ టీవీకి రూ.200 కోట్ల ముడుపులు అందినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో రాజా, కనిమొళి, కరుణానిధి భార్య దయాళ్‌అమ్మాల్‌ తదితరులపై ఈడీ మానీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. తుది తీర్పుపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో.. కోర్టు తీర్పును డిసెంబర్‌ 5కు వాయిదా వేయడం గమనార్హం.