మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

సికింద్రాబాద్: లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు సంతోష్ కుమార్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఆలయ పండితులు, మంత్రులు, అధికారులు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉజ్జయిని మహంకాళి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మొక్కలు చెల్లించేందుకు భక్తులు బారులు తీరారు.