మహనీయుల స్ఫూర్తితో పురోగతికి పునరంకితమవుదాం..
ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న కార్పొరేటర్ సుమన్
మేడిపల్లి – జనంసాక్షి
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహం నుండి మల్లాపూర్ రోడ్ డంపింగ్ యార్డు వరకు గల ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో కార్పొరేటర్ సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. మహనీయుల స్ఫూర్తితో దేశ పురోగతికి పునరంకితం కావాలని ఆకాంక్షించారు. ఈ రన్ లో డివిజన్ నాయకులు శ్రీనివాసరావు, నరేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు కలిసి పాల్గొన్నారు.