మహబూబా బాద్ జిల్లాలోని వివిధ గ్రామాలను సందర్శించిన ఏఐసీ-సీసీఎంబి-ఎస్పీఏఆర్ఎస్హెచ్ బృందం

మహబూబాబాద్  -జూలై28(జనంసాక్షి)

అటల్ ఇంక్యుబేషన్ సెంటర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ-హైదరాబాద్ ఎస్పీఏఆర్ఎస్హెచ్ సెంటర్ సంయుక్తంగా మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలను, గిరిజన తండాలను 18 జూలై నుండి 28 జూలై వరకు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత మహిళలు ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సమస్యలు, పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు శిశువులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేయడానికి ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ మేఘన గిరీష్, డా.గాజుల ప్రభాకర్, అభిషేక్ గైకర్, అజయ్ కుమార్, బాలక్రితుహ ల బృందం జూలై 18 నుండి 28 వరకు పది రోజుల పాటు ఈ అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈ అధ్యాయంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్, వివిధ మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు, గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లతో మాట్లాడి ఆరోగ్య, మానసిక సమస్యలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.