మహరాష్ట్రకు ప్రత్యేక బృందం ….
మహరాష్ట్రకు ప్రత్యేక బృందం ….
హైదరాబాద్: షోలాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు, కుటుంబసంక్షేమశాఖ కమిషన్‌ర్ ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు బయల్ధేరి వెళ్లింది. తక్షణమే హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి వెళ్లి పోస్టుమార్టం, చికిత్సలను పర్యవేక్షించాల్సిందిగా సీఏం ఆదేశించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపి 30 మంది ప్రాణాలు బలి తీసుక్ను కాళేశ్వరి ట్రావేల్స్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కాళేశ్వరి ట్రావెల్స్ యాజమాన్యం పై సర్కారు చర్యలకు సిద్ధమవుతోంది.