మహాకూటమి మాయలకు లొంగిపోవద్దు

ప్రచారంలో పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి

పెద్దపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగున అడ్డుతగిలిన మహా కూటమి పార్టీల మాయ మాటలకు ప్రజలు మోస పోవద్ధని పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెట్టి మనోహర్‌రెడ్డి కారు గుర్తుకు ఓటివ్వాలని విజ్ఞప్తి చేశారు. కుల, మతాలకతీతంగా మద్ధతు పలికి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కారుగుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల కలిసి కారు గుర్తుకే ఓటెయ్యాలని అభ్యర్థించారు. ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలు, నాలుగేళ్లలో జరిగిన గ్రామాలాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమంపై వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ బిడ్డలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి టీఆర్‌ఎస్‌ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.