మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి గ్రంథాలయాల వారోత్సవాలు

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల(మెన్), ధర్మపురి లో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని,కళాశాల ప్రిన్సిపల్ అలగొండ రాధకిషన్ జనం సాక్షి మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు గ్రంథాలయాల యొక్క పాత్ర ను, గ్రంథాలయోద్యమము యొక్క ప్రాధాన్యతను కళాశాల ప్రిన్సిపల్ అలగొండ రాధకిషన్ వివరించడం జరిగింది. అలాగే అధ్యపక బృందం గ్రంథాలయాలు పోటీ పరీక్షలలో యే విధంగా ఉపయోగపడుతాయో వివరించడం జరిగింది. జీవితం లో పుస్తక పఠనం ఎంత విలువైనదో వివరించడం జరిగింది. ఉన్నత విద్యలో డిజిటల్ గ్రంథాలయాల పాత్రను మరియు స్వయం వెబ్ పోర్టల్, మూక్స్ కోర్సుల యొక్క ప్రాధాన్యత ను లైబ్రేరియన్ అడిచెర్ల శ్రీనివాస్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.