మహాత్మ జ్యోతిబా గురుకుల పాఠశాలలో ఘనంగా గణనాథునికి పూజలు.
విశేష పూజలు అందుకున్న మట్టి వినాయకుడు.
తాండూరు అగస్టు 31(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని మహాత్మ జ్యోతిబా బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం వినాయక చవితి పురష్కరించుకోని పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న ఆధ్వర్యంలో మట్టి వినాయకున్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు కలిసి లంబోధరున్ని వివిధ పూలు పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు .అనంతరం విద్యార్థులకు గణనాథుని ఆశీస్సులు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకున్ని ప్రతిష్టించి పూజించా మని తెలిపారు. ప్లాస్టర్ అఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుని ద్వారాఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని వెల్లడించారు. నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జలచరాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అదేవిధంగా నీటి కాలుష్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.