మహానాడులో తెలంగాణపై తీర్మానం: రేవూరి

వరంగల్‌, జనంసాక్షి: టీడీపీ మహానాడులో తెలంగాణపై తీర్మానం ఉంటుందని నర్సంపేట టీడీపీ ఎమ్మెల్యేరేవూరి ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాటుతో తీర్మానం చేయిస్తామని ఆయన సోమవారమిక్కడ వెలంలడించారు. కడియం శ్రీహరి టీడీపీ వల్ల ఎన్నో విధాలుగా లబ్ధి పొందారని రేవూరి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లో చేరడం వల్లే ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశామన్నారు. తెలంగాణ కోసం కడియం జేఏసీ వైపు వెళ్తే తాము కూడా స్వాగతించేవాళ్లమని రేవూరి అన్నారు.