ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడు బొజ్జా తారకం అంత్యక్రియలు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. అంతకుముందు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తారకం పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి అంతిమ యాత్ర మొదలై ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానం వరకు సాగింది. అంతిమ యాత్రలో పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.