మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

– కొత్త స్ట్రేయిన్‌ భయంతో..

ముంబై,డిసెంబరు 21 (జనంసాక్షి): బ్రిటన్‌లో కరోనా నూతన స్ట్రెయిన్‌ జూలు విదల్చడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ వచ్చేనెల 5వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రకటించింది. ముంబై నగర పాలక సంస్థ పరిధిలో ఈ కర్ఫ్యూ అమలు చేస్తామని తెలిపింది. మంగళవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ మొదలవుతుందని వివరించింది. యూరోపియన్‌ యూనియన్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి వచ్చే రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు మంగళవారం నుంచి తప్పనిసరి సంస్థాగత క్వారంటైన్‌కు వెళ్లాలని స్పష్టం చేసింది. ఆదివారం నాడే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే రాష్ట్రంలో కరోనాను నియంత్రించడానికి రాత్రి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మహారాష్ట్రలోనూ, దాని రాజధాని ముంబైలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.