మహారాష్ట్ర పోలీసులకు.. 

బాంబే హైకోర్టు షాక్‌
– పౌరహక్కుల నేతల అరెస్టులను తప్పుబట్టిన కోర్టు
ముంబయి, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : అయిదుగురు పౌరహక్కుల నేతల అరెస్టుల కేసులో మహారాష్ట్ర పోలీసుల తీరును బాంబే హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ పరంబీర్‌ సింగ్‌ విూడియా సమావేశంపై దాఖలైన పిటిషన్‌ ను కోర్టు సమర్థించింది. ఈ వ్యవహారం కోర్టులో ఉండగానే ఎందుకు విూడియా సమావేశం నిర్వహించారని పోలీసులపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ కేసును ఇన్‌ కెమెరా విచారణను కోరుతున్న పోలీసులు విూడియా సమావేశం పెట్టి, సాక్షాలను బహిరంగ పర్చడంపై పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను ఎన్‌ఐఏ అప్పగించాలని కోరారు. కోరేగావ్‌ – భీమా అల్లర్ల కేసుకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అజ్ఞాతంలో ఉన్న మావోలకు, ఇతర మావోలకు మధ్య నడిచిన వేలాది లేఖల్ని స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఏడీజీ పరంబీర్‌ సింగ్‌ విూడియా సమావేశం నిర్వహించారు. రాజీవ్‌ హత్య తరహాలో మోడీ హత్యకు కుట్రపన్నారని, కోరేగావ్‌ – భీమా కేసులో ఢిల్లీలో అరెస్టయిన మరో హక్కుల కార్యకర్త రోనా జాకబ్‌ విల్సన్‌ కు, ఓ మావోయిస్టు నేత ప్రకాశ్‌ కు మధ్య ఈ మెయిల్స్‌ లో జరిగిన సంభాషణలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయని సాక్ష్యాధారాలను విూడియా ముందు ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర చేసారనే అభియోగాలతో  విరసం నేత వరవరరావు, సుధా భరద్వాజ్‌, గౌతం నావ్‌లాక్‌, తెల్తూంద్డే, వెర్నన్‌ గొన్జాల్వేస్‌ను పుణెళి పోలీసులు గతవారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులపై వచ్చిన అభ్యంతరాలను సమర్ధించిన  సుప్రీంకోర్టు వీరిని  సెప్టెంబరు 6వరకు హౌస్‌ అరెస్ట్‌లోఉంచాల్సిందిగా  ఆదేశించింది.