‘మహా’సంకీర్ణం

– ఈ కాపురం ముందుకు సాగదు

– భాజపా పెదవి విరుపు

ముంబై,నవంబర్‌ 22(జనంసాక్షి):’మహా’ రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే చేపట్టనున్నారు. అలాగే కాంగ్రెస్‌, ఎన్సీపీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కకనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం మూడు రాజకీయ పార్టీలు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. దీంతో మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది.దాదాపు గంటన్నర పాటు కొనసాగిన సమావేశం అనంతరం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ మాట్లాడుతూ… ‘మహారాష్ట్రకు కాబోయే సీఎం ఉద్దవ్‌ ఠాక్రే. మూడు పార?టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్టీల ఎమ్మెల్యేలు లేఖపై సంతకం చేశారు. మా ఎజెండాపై మరింత చర్చలు జరుపుతాం.’ అని తెలిపారు. కాగా ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేనకు, కాంగ్రెస్‌, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్‌ పదవి కాంగ్రెస్‌కేనని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రి పదవులు లభించనున్నట్లు సమాచారం.

సీఎం పదవి విూరే చేపట్టండి: పవార్‌ ఉద్దవ్‌ రాక్రేను కోరిన శరద్‌ పవార్‌!

ముంబయి: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్‌ ఠాక్రే చేపట్టాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకొని చెప్తానని ఉద్దవ్‌ సమాధానం ఇచ్చినట్లు సేన నాయకులు తెలిపారు . గురువారం అర్ధరాత్రి రాత్రే పవార్‌ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని అన్నారు. ప్రభుత్వంలో ఆదిత్య రాక్రే పాత్ర ఏంటనే అంగమూ ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.అనేక చర్చల అనంతరం మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమితో ప్రభుత్వ ఏర్పాటు దాదాపు | ఖరారైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని శుక్రవారమే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది .ముఖ్యమంత్రి పదవి శివసేనకు దక్కేలా మూడు పార్టీలు అంగీకరించాయి. మొత్తం ఐదేళ్ల కాలం శివసేన నేత పదవిలో ఉండేలా నిర్ణయానికొచ్చినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు . అంతకుముయు శివసేన, ఎన్సీపీలు సీఎం పదవీ కాలాన్ని పంచుకుంటాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో కలవం

– శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లో జతకట్టేది లేదని, ఇంధ్రుడి సింహాసనం ఇచ్చినా కలవమని శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా నుంచి మళ్లీ ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. ఇకపై బేరసారాలకు తావులేదన్నారు. భాజపాతో జట్టుకట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇంద్రుడి సింహాసనాన్ని ఇస్తామన్నా భాజపాతో కలిసేది లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో శివసేనకు చెందిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటారని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్న పక్షాలతో కలిసి గవర్నర్‌ని కలవనున్నారా అన్న ప్రశ్నకు సందిస్తూ.. రాష్ట్రపతి పాలన అమలులో ఉండగా గవర్నర్‌ని కలిసేది ఎందుకని సమాధానమిచ్చారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీల మహావికాస్‌ అఘాదీ సంకీర్ణ ప్రభుత్వంలో చిన్న పార్టీల పాత్రపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మహారాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌-ఎన్సీపీ, శివసేన తుది దఫా చర్చలు జరిపాయి. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్‌-ఎన్సీపీ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలు ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన చిన్న పార్టీల మద్దతు కూడా కోరనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల చేరికతో ఏర్పాటవుతున్న కొత్త కూటమికి ‘మహా వికాస్‌ ఆఘాడీ’గా నామకరణం చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ నాయకుడు బాలాసాహెబ్‌ థోరట్‌కు డిప్యూటీ సీఎం దక్కే అకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వం ఏర్పాటు చేసినా 6-8 నెలలే: గడ్కరీ

రాంచీ (ఝార్ఖండ్‌): మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు జట్టు కట్టడాన్ని అవకాశవాద కూటమిగా కేంద్రమంత్రి, భాజపా సీనియర్‌ నేత గడ్కరీ అభివర్ణించారు . ఒకవేళ వారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆరు నెలలు లేదా మహా అయితే 8 నెలలకు మించి ఉండబోదని జోస్యం చెప్పారు . ఝార్ఖండ్‌ ఎన్నికల సన్నాహాకాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన పీటీఐ వార్తా సంస్థకు శుక్రవారం ఇంటర్వ్యూ ఇచ్చారు.”అవకాశవాదం అనే పునాదులపై ఆ కూటమి ఏర్పడింది. భాజపాని అధికారానికి దూరం చేయాలన్నదే వారి లక్ష్యం. ఒకవేళ వారు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆరు నెలలు కొనసాగుతుంది. మహా అయితే ఎనిమిది | నెలలకు మించి ఉండదని నా అభిప్రాయం” అని గడ్కరీ చెప్పుకొచ్చారు. మూడు వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కూటమిగా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవ్వడంపై ఆయన మాట్లాడుతూ… ‘రాజకీయాలు, క్రికెట్లో ఏదైనా జరగొచ్చు’ అని వ్యాఖ్యానించారు . ఒకవేళ కూటమి విచ్ఛిన్నమైతే ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా ముందుకొస్తుందా? అని ప్రశ్నించగా.. భవిష్యత్‌ కార్యచరణను పార్టీ నిర్ణయిస్తుందన్నారు . శివసేన చెబుతున్న సీఎం పదవికి సంబంధించిన ఒప్పందమేది జరగలేదున్నారు . తాను దాని గురించి ఆరా తీశానని చెప్పారు . ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత పవార్‌ భేటీ గురించి తనకేవిూ తెలీదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.