మహాసేన్‌ తుపాను

ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లోనూ ఈరోజు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన నేపథ్యంలో దీనికి మహాసేన్‌ తుపానుగా నామకరణం చేశారు. ఇది ప్రస్తుతం చెన్నైకి అగ్నేయంగా 1300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశం ఉంది. వచ్చే 36 గంటల్లో తుపాను దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్‌, మయన్మార్‌ల వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని, పోర్ట్‌బ్లెయిర్‌, నికోబార్‌ దీవులు పరిసర ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని మత్య్సకారులు అటువైపు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు.