మహిళలపై దాడులను అరికట్టాలి

కలెక్టరేట్‌ ముందు సీపీఎం ఆందోళన

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30:  మహిళలపై హద్దులు మీరుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ సిపి ఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ముందు ఆందోళన చేపట్టారు. అంతకు ముందు నగరంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సం దర్బంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యు లు టి.సాగర్‌ మాట్లాడుతూ దేశంలో నూ, రాష్ట్రంలోనూ మహిళల మీద దాడులు, అత్యాచారాలు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్నాయని అన్నారు. మహిళలు విలాసవస్తువుగా, వ్యాపార సరుకుగా భావించే ధోరణిని దేశంలో అమలు జరుగుతున్న సరళీకరణ విధా నాలు పెంచిపోషిస్తున్నాయని ఆరోపిం చారు. ప్రభుత్వాల అవినీతి అక్రమాలు అసాంఘిక శక్తుల వ్యాప్తిని ప్రోత్స హిస్తున్నాయన్నారు. 2008 నుండి 2010 మధ్య కాలంలో 76,924 మంది మహిళలపై హింసా నేరాలు రాష్ట్రంలో నమోదు చేయబడ్డాయని, సగటున ప్రతీ రోజు రాష్ట్రంలో ప్రేమో న్మాదుల అత్యాచారాలకు 13 మంది యువతులు బలయ్యారని ఆవేదన వ్య క్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను, అత్యాచారాలను ఖండిం చాల్సిందిపోయి, అనేక మంది రాజ కీయనాయకులు, చాందసవాదులు వాటికి మహిళలే బాధ్యులని నిందిస్తు న్నారన్నారు. పోలీసు,పాలనా యంత్రాంగాలు మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యాయని తెలిపా రు. బహిరంగ ప్రదేశాల్లోనూ, ప్రయాణాల్లోనూ ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టడంలో వైఫల్యాల వల్ల వివాహిత మహిళలకు సైతం రక్షణ కరువయ్యిందని, ఈ అత్యాచారాల్ని అరికట్ట డానికి గట్టి చర్యలు అవసరముందన్నా రు. సమాజంలో మహిళలు గౌరవం గా తలెత్తుకొని పని చేయగలిగే పరిస్థి తులు నెలకొల్పడానికి ప్రభుత్వం చర్య లు చేపట్టాలని, అత్యాచారాలను ఖం డించే బలమైన ప్రజాభిప్రాయాన్ని స మీకరించడం నేటి పరిస్థితుల్లో అవస రమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యద ర్శి పెద్ది వెంకట్రాములు, నగర కార్య దర్శి దండివెంకట్‌, నగర కమిటీ సభ్యు లు ఎస్‌.లత, నూర్జహాన్‌, మల్యాల గోవర్ధన్‌, గణపతి, మధు, విజయల క్ష్మి తదితరులు పాల్గొన్నారు.