మహిళలపై పబ్లిక్‌లో 8 నెలలు గ్యాంగ్ రేప్

x11-1428732790-stop-rape-56
ఇరాక్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండ పోతున్నది. మహిళను బహిరంగంగా సామూహిక అత్యాచారం చేసి వారి పైశాచికాన్ని మరోకసారి ప్రపంచానికి చూపించారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల బాధిత మహిళలు, యువతులు చెబుతున్న పచ్చినిజాలను వెల్లడించారు. ఉత్తర ఇరాక్ లోని సింజర్ పట్టణంలో వేలాధి మంది యజీదీ మతస్తులు నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం ఈ పట్టణంలోకి చోరబడిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వందలాధి మంది యజీదీ మహిళలు, యువతులు, పిల్లలను బలవంతంగా తీసుకు వెళ్లారు. తరువాత తమ స్థావరాల్లో నిర్బంధించారు. మహిళలపై పబ్లిక్‌లో 8 నెలలు గ్యాంగ్ రేప్ మహిళలు, యువతులను రోడ్డు మీదకు తీసుకు వచ్చి బహిరంగంగా సామూహిక అత్యాచారం చేశారు. మహిళలను సెక్స్ బానిసలను చేశారు. అంతే కాకుండా అందంగా ఉన్న మహిళలను తీవ్రవాదుల నాయకులకు బహుమతిగా ఇచ్చారు. మహిళల మీద దాడులు చేసి ఇస్లాం మతంలోకి మారాలంటూ బలవంతం చేశారు. వారి కామవాంచ తీరిపోవడంతో గత వారం హిమోరా నగరంలో బంధిలుగా ఉన్న 200 మంది యజీదీ మహిళలను విడుదల చేశారు. బాధితులు చెబుతున్న వివరాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తమను అమ్మేశారని, సెక్స్ బానిసలు చేశారని వారు చెబుతున్నారు. బహిరంగ ప్రాంతాలలో ఇష్టం వచ్చినట్లు తీవ్రవాదులు సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని వారు విలపిస్తున్నారు. ఎక్కువగా యువతుల మీద ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.