మహిళల కోసం నా సీటు వదులుకుంటా

` బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా..
` భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా
` మహిళలు రాజకీయాల్లోకి రావాలి:మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్న మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్‌ టెక్‌పార్క్‌ను ప్రారంభించిన మంత్రి.. మహిళా బిల్లుపై స్పందించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ను పూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మన జీవితాలు చాలా చిన్నవని.. అందులో తన పాత్ర తాను పోషించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలులో తన సీటు పోయినా.. వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడిరచారు. అంతకు ముందు టెక్‌పార్క్‌ను ప్రారంభించిన తర్వాత విదేశీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను సత్కరించారు. జకీయాలకు అతీతంగా ప్రజల కోసం ఎన్నో సమస్యలను మేము లేవనెత్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై అందరు కలిసి నిలబడాలని ఆయన ఎక్స్‌  వేదికగా కోరారు. మంగళవారం పార్లమెంట్‌ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టినందుకు భారతీయ పౌరుడిగా గర్విస్తున్నానని ఆయన తెలియజేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీల వారందరికీ కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును కోసం సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం కూడా దీనిని సాకారం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినందుకు సంతోషం, గర్వంగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని ఆయన గుర్తించారు. జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, గ్రామ పంచాయతీల్లో అమలు చేశామని పేర్కొన్కారు.