మహిళల, రైతుల ఆర్థిక అభివృద్ధికి నాబార్డ్ విశేష కృషి – నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ జయ ప్రకాష్

జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లాలోని మంథని మండలంలో ఘనంగా అజాధిక అమృత మహోత్సవం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ జయ ప్రకాష్ మాట్లాడుతూ.. నాబార్డ్ ద్వారా తెలంగాణలో ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎస్ ఎస్ జి మహిళల కోసం ఎంఈడిపి ఎల్ఈడిపితో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందాన్నారు. వీటి ద్వారా మహిళలకు బ్యాంకుల ద్వారా క్రెడిట్ లింకేజీని అందించడం జరుగుతుంది. దీనితో పాటు ప్రైమరీ అగ్రికల్చర్ కోపరేటివ్ సొసైటీస్కు నాబార్డ్ ద్వారా సబ్సిడీ స్కీమ్స్ తో పాటు లోన్ గ్రాంట్ లను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్ఎస్సి మహిళలకు ఒక ఐదు వేల మందికి ఎండిపి ఈ డిపి లైలవుడు ఎంటర్ప్రైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మైక్రో ఎంటర్ప్రైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి నాబార్డ్ కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఉన్ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ధార రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వారు పండించిన ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి వాటిని మార్కెటింగ్ చేసుకునే సదుపాయాన్ని రూరల్ మాటల ద్వారా, రూరల్ హాట్ ల ద్వారా కల్పించడం జరుగుతుంది. దీనితో పాటు వాతావరణ నిర్ధారణ పథకం కూడా నాబార్డ్ ద్వారా పెద్ద పెల్లి జిల్లాలో మంథని మండలంలో వాతావరణంలో మార్పులకు అనుగుణంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయంతో పాటు కూరగాయల సాగు నీటి సంరక్షణ పనులు భూమిలో ఫేమస్ శాతాన్ని పెంచేందుకు వేసవి దిక్కులు అలాగే చెరువు మట్టిని తీయుట కార్యక్రమాలను నాబార్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది అని వివరించారు. మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంపొందించుకొనుటకు వారికి గ్రామీణ మేళాల ద్వారా మార్కెటింగ్ లో సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఏపిమ్ పద్మ, వెలుగు రేఖ రూరల్ డెవలప్ మెంట్ సిఈఓ రజిత, జన వికాస్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ సిఈఓ పెండ్లి సంపత్ కుమార్, ప్రతి నిధి పెసరి రాజు, అలాగే ఎస్ హెచ్ జి మహిళలు మహిళా రైతులు పాల్గొన్నారు.