మహిళల సాధికారతకు ఇదే నిదర్శనం.. మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌

మహిళల సాధికారతకు ఇదే నిదర్శనం.. మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌

జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్‌ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతున్నదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఓ కూలీబిడ్డ, రైతు బిడ్డ, ఆటో డ్రైవర్‌ కొడుకు.. ఇలా ఎంతోమంది నిరుపేద పిల్లలకు నేడు వైద్య విద్య చేరువయ్యిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్య సీట్లు పొందిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం సాధికారతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం అందించిన గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకుని, విజయవంతంగా వైద్య విద్య పూర్తి చేసి పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి రుణం తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్య సీటు పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.