మహిళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి.

జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి.
డిసిసి మహిళా అధ్యక్షురాలు చారులత రాథోడ్.
జనం సాక్షి ఉట్నూర్.
అదిలాబాద్ జిల్లా లో మహిళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సోమవారం డిసిసి మహిళా అధ్యక్షురాలు జెడ్పిటిసి చారులత రాథోడ్ అధ్వర్యంలో ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి పాల్గొని మహిళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రతి మండలాల్లో గ్రామాల్లో కమిటీలు నిర్వహించాలని రానున్న ఎన్నికల కోసం ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీబాయి గుడేహత్త్నూర్ మండల అధ్యక్షురాలు అనసూయ నార్నూర్ మండల మహిళ అధ్యక్షురాలు సునీత ఉప అధ్యక్షురాలు అనిత బ్లాక్ ప్రసిడెంట్ రాధ మరియు అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు.
Attachments area