మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట
మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత రెడ్డి
హుస్నాబాద్ రూరల్ నవంబర్ 16(జనంసాక్షి)మహిళా శిశు సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 4వ వార్డ్ బీడీకాలనీ లోని అంగన్వాడి సెంటర్లో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం,పిల్లలకు బాలామృతం పంపిణీ చేశారు.మహిళలు,పిల్లల సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ నిలించిందని. సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవతో గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పోషక ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వరూప,అంగన్వాడీ ఆయా స్వరూప, గర్భిణీ స్త్రీలు,పిల్లలు పాల్గొన్నారు.