మహిళ దారుణహత్య
కరీంనగర్,ఫిబ్రవరి8(జనంసాక్షి):కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను దుండగులు తలపై బండారాయితో కొట్టి చంపేశారు. అయితే మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపోలో రీచ్ ఆస్పత్రి పక్కన పాల దుకాణం షెడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.