మహిళ రైతులకు ఐదు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం
పి.వి.నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు ఆధ్వర్యంలో భారతీయ వ్యవసాయ పరిశోదన మండలి వారి ఆర్థిక సౌజన్యంతో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద మహిళ రైతులకు ఐదు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు మహిళా రైతులకు పౌల్ట్రీ హేచరీ యూనిట్ మరియు కోళ్ల ఫామ్ సందర్శించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా పశువైద్యశాస్త్రవేత్తలు డాక్టర్ జె.శశాంక్ మరియు డాక్టర్ జె. సాయి కిరణ్ మహిళా రైతులకు పౌల్ట్రీ హేచరీ యూనిట్ సందర్శనకు తీసుకువెళ్లి అక్కడ వాడే పరికరాలు, కోడి పిల్లలను ఎలా ఉత్పత్తి చేస్తారొ మరియు ఇంక్యుబేటర్స్ గురించి వివరంగా తెలియజేయడం జరిగినది. అదేవిధంగా ఇంక్యుబేటర్లో కోడిగుడ్లను ఎలా అమర్చాలి, రోజుకు ఎన్నిసార్లు గ్రుడ్డును తిప్పాలి,మరియు మరియు హేచరీ యూనిట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉష్ణోగ్రతలు, తేమ మొదలైన అంశాలు గ్రుడ్డు అమర్చినప్పటి నుంచి కోడి పిల్లలు ఉత్పత్తి చేసే వరకు పాటించవలసిన పద్ధతులను మహిళల రైతులకు వివరించడం జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పౌల్ట్రీ ఫార్మును కూడా సందర్శించడం జరిగినది. సందర్శనలో భాగంగా కోడి పిల్లలను శాస్త్రీయంగా ఎలా పెంచాలో, గృహవసతి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో రైతులకు క్షుణ్ణంగా వివరించడం జరిగినది. ముగింపు కార్యక్రమలో కృషి విజ్ఞాన శాస్త్రవేతలు సౌమ్య, రాజు , గణేష్ మరియు కట్రియాల గ్రామ మహిళా రైతులు పాల్గొన్నారు.