మహీంద్రా ఫౌండేషన్ నైపుణ్య శిక్షణ
హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): పట్టభద్రులైన నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టెక్ మహేంద్రా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వివిధ కోర్సుల్లో ఈ శిక్షణ ఉంటుంది. నాలుగు నెలలపాటు అనుభవజ్ఞులతో ఫౌండేషన్ కోర్సును అందిస్తారు. డిగ్రీ చేతబట్టుకుని బయటకు వచ్చినా తగిన నైపుణ్యం లేని కారణంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి టెక్ మహేంద్రా ఫౌండేషన్ నైపుణ్యం ఉన్న కోర్సులను ఉచితంగా అందిస్తున్నది. పది, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 27 ఏండ్ల వయసు గల నిరుద్యోగ యువత శిక్షణకు అర్హులు. నాలుగునెలలపాటు సాగే కంప్యూటర్ బేసిక్స్, ఐటి స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ 2010, అడ్వాన్డ్స్‌ఎంఎస్ ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్‌ప్లేస్ రెడీనెస్, ఆన్‌జాబ్ ట్రైనింగ్ , బీకాం ఉత్తీర్ణులైన వారికి ట్యాలీ, ఈఆర్‌పీ 9, బేసిక్ అకౌంట్స్, జీఎస్‌టీ అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తామని సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల10 లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9515665095, 9100330378లను సంప్రదించాలన్నారు.