మాంసం విక్రయ నిషేధంపై స్టే

1

ముంబై హైకోర్టు సంచలన తీర్పు

ముంబై,సెప్టెంబర్‌14(జనంసాక్షి):

మహారాష్ట్ర ప్రభుత్వానికి మాంసం నిషేధంపై చుక్కెదురయ్యింది.  రాజధాని ముంబయిలో సెప్టెంబరు 17వ తేదీన మాంసం అమ్మువచ్చని బాంబే హైకోర్టు తెలిపింది. ముంబయి యంత్రాంగం విధించిన నిషేధాన్ని కోర్టు వ్యతిరేకించింది. అయితే కబేళాలపై ఉన్న నిషేధం అంశంలో కోర్టు జోక్యం చేసుకోలేదు. జైనుల పర్యుషాన్‌ పర్వదినాల సందర్భంగా మాంసం అమ్మకంపై నిషేధం విధించిన అంశం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. జైనుల దీక్షల నేపథ్యంలో ముంబయి అధికారులు ఈ నెల10,13,17,18 తేదీల్లో మాంసం అమ్మకాలను నిషేధించారు. అయితే దీనిపై ముంబయి మాంసం అమ్మకందారుల అసోసియేషన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు శుక్రవారం జరిగిన విచారణలో 13, 18 తేదీల్లో నిషేధం ఎత్తేసింది. తాజాగా 17న కూడా మాంసం అమ్మవచ్చని తెలిపింది. భాజపా పరిపాలనలోని పలు రాష్టాల్రు కూడా జైనుల దీక్ష నేపథ్యంలో మాంసం అమ్మకాలు నిషేధించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుతో  ఇప్పుడు ఇక అమ్మకాలపై నిషేదం తొలగింది.