మాజీ ఉప సర్పంచ్ బొల్లం ఉపేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన

-బిఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి

కురవి అక్టోబర్ -14
(జనం సాక్షి న్యూస్)

కురవి మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్  బొల్లం ఉపేందర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ స్వర్గస్తులు కావడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పిన తెరాస జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి. ఆయన వెంట బిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవి నాయక్,మాజీ కురవి మండల వైస్ ఎంపీపీ పెద్ది వెంకన్న, మాజీ ఆలయ చైర్మన్ బాదవత్ రాజు నాయక్,గ్రామ సర్పంచ్ కాలం తిరుపతి రెడ్డి,సిరోలు ఎంపీటీసీ బోజ్యా నాయక్, రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ సముద్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.