మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేని.
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 19. (జనం సాక్షి) భారత ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ అందించిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 105వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి పథంలో నడిచేందుకు ముందు చూపుతో శ్రీమతి ఇందిరాగాంధీ అనేక పథకాలను తీసుకొచ్చారని అన్నారు. గరీబి హటావో తో పాటు అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలోని వచ్చాయని తెలిపారు. చివరకు దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఇందిరా గాంధీ త్యాగాలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరు బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, నాలుక సత్యం ,బుర్ర మల్లేశం గౌడ్, వెంగళ అశోక్ శ్రీరాముల వెంకటేశం ,నక్క నరసయ్య తదితరులు పాల్గొన్నారు.