మాజీ స్పీకర్‌ బల్‌రాం జక్కర్‌ మృతి

3
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్‌ బలరాం జక్కర్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం పంజాబ్‌లోని ఆయన స్వగ్రామంలో జక్కర్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బలరాం జక్కర్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు సంతాపం తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప నేత బలరాం జక్కర్‌ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1980-1989 మధ్యకాలంలో బలరాం జక్కర్‌ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004-2009 మధ్య కాలంలో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన నివాసానికి వెల్లిన  కశ్మీర్‌ మాజీ సిఎం ఫరూక అబ్దుల్లా నివాళి అర్పించారు. పలువురు నేతలు జక్కర్‌ భౌతిక కాయం వద్ద నివాళి అర్పించారు. స్పీకర్‌గా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేశారని అన్నారు.