మాటీవీపై దాడి ఘటనలో కేసు నమోదు
హైదరాబాద్, జనంసాక్షి: మాటీవీపై దాడి చేసిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 147,148,149,341,452,427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనువాద ధారావాహికలను నిలిపివేయాలన్న తమ వినతి పెడచెవిన పెట్టడంతో ఆగ్రహించిన టీవీ కళాకారులు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని మాటీవీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. రాళ్లతో కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో సెక్యూరిటీ గార్డు తలకు, కాళ్లకు రాళ్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి.