మాధవ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి )
లయన్స్ వరంగల్ వారియర్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్ నేషనల్ సంయుక్త అధ్యర్యంలో ఆదివారం శంభునిపేటలోని మాధవ హాస్పిటల్ నందు ఉచిత మేగా వైద్య శిబీరం జరిగినది. ఈ వైద్య శిబిరమును లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ అధ్యక్షులు మండల పరశురాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరశురాములు మాట్లాడుచూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో లయన్స్ క్లబ్స్ ముందుంటాయని, నిరుపేదలు ఆరోగ్య విషయాల లో ఏలాంటి అశ్రద్ద చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటేనే జీవనం సాఫీగా కొనసాగుతుందని అన్నారు.
ఈ వైద్య శిబీరంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, డెంటిస్ట్ వర్షారెడ్డి, పిజియో’ థెరపిస్ట్ డా సుమన్, చైల్డ్ వుడ్ క్యాన్సర్ చైర్ పర్సన్ లయన్ డా. ఆకారపు రాజు గోపాల్, కోశాధికారి నాసం – ప్రవీణ్, కార్యదర్శి . నవీన్ రెడ్డి, నాయకుడు కర్ని రవిందర్, సుమారు 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు జరిపి మందులను అందజేసారు.