మానవతా దృక్పదం చాటుకున్న ఆర్ఎంపీలు
ఇబ్బందుల్లో ఉన్న తోటి ఆర్ఎంపీ కుటుంబానికి 20వేల ఆర్ధిక సాయం
హుజూరాబాద్ (జనం సాక్షి)
తోటి ఆర్ఎంపీ వైద్యుడు ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకొని, ఆ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించి మానవతా దృక్పదాన్ని చాటుకున్నారు హుజూరాబాద్ మండల ఆర్ఎంపీ వైద్యులు. వివరాలిలా ఉన్నాయి…మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సింధీ శ్రీనివాస్ (ఆర్ఎంపి) ఆరోగ్యరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఇతని పెద్ద కుమారుడు షిండే నితిన్ (20) రైలు ప్రమాదంలో మృతి చెందాడు. తీవ్ర దిగ్భాంత్రికి గురైన శ్రీనివాస్ను సోమవారం ఆర్ఎంపీల సంఘం సభ్యులు
కలిసి పరామర్శించారు. సంఘం తరుపున 20వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల అధ్యక్షులు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి పంజాల తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.