మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : వార్డ్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారికి ఆపద వస్తే అండగా నిలిచే స్థానిక 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు మరోసారి మానవత్వం చాటుకున్నారు.స్థానిక 45వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన ఎస్ కె జాని గురువారం అనారోగ్యంతో మరణించారు.విషయం తెలిసిన వెంటనే కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు జానీ కుటుంబ సభ్యులను పరామర్శించి , అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.16 వేలు ఆర్దిక సహాయం అందించారు.ఈ సందర్భంగా జానీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న తమకు అండగా నిలిచిన కౌన్సిలర్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైనా, తోఫి, బాబా, లతిఫ్, హాజి , నాయకులు కుక్కడపు సాలయ్య , భిక్షం, వెంకటేష్ , కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.