మానవ హక్కుల పరిరక్షణ సంస్థ మహబూబాబాద్ జిల్లా సెక్రటరీగా రాజశేఖర్

 

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్12(జనంసాక్షి)

మానవ హక్కుల పరిరక్షణ సంస్థ మహబూబాబాద్ జిల్లా కమిటి సమావేశం మంగళవారం స్థానిక జిల్లా కార్యక్రమంలోలో నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ఛైర్మన్ డబ్బేటి శ్రీనివాస్ హాజరైనారు. మహబూబాబాద్ జిల్లా సెక్రెటరీగా గార్ల మండలంలోని అంబేత్కర్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త ఏసుమల్ల రాజశేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజశేఖర్ ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాజశేఖర్ ఎన్నికకు సహకరించిన డిప్యూటీ ఛైర్మన్ దబ్బెటి శ్రీనివాస్, జిల్లా చైర్మన్ సంజీవరావుకు కృత్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఛైర్మన్ బెస్త సంజీవరావు, జిల్లా చైర్ పర్సన్ ఎస్కె రేష్మా , జనరల్ సెక్రెటరీ పోలేపాక కార్తిక్, వేంపల్లి సతీష్,శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.