‘మాయాబజార్’కు అరుదైన గౌరవం
హైదరాబాద్, జనంసాక్షి: తెలుగు చలనచిత్రలో సువర్ణాధ్యాయంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మాయాబజార్ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమైన చిత్రరాజంగా ఎంపికైంది. ఇప్పటి వరకు వచ్చిది. సినిమాల్లో అత్యంత గొప్ప చిత్రమేది అనే అంశంపై సీఎన్‌ఎన్-ఐబీఎన్ జాతీయ స్థాయిలో ఒక పోల్‌నిర్వహించింది. ఈ పోల్‌లో మాయాబజార్ మొదటిస్థానంలో నిలిచింది. 23.91 శాతం ఓట్లను సంపాదించుకుంది. దీని తర్వాతి స్థానంలో చంద్రముఖి మాతృక అయిన మలయాళీ సినిమా మణిచిత్ర తాళు 21.17 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. రాంగోపాల్ వర్మ శివ 7స్థానాన్ని దక్కించుకుంది. టాప్ 100సినిమాల్లో తెలుగువారి ఆణిముత్యాలు అనదగ్గ పలు సినిమా స్థానం సంపాదించుకున్నాయి.