మాయ చేసేవారిని ఎన్నికల్లో గెలిపించొద్దు.

గత రెండు దఫాలుగా ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను గెలిపించుకున్నారు. అద్భుతమైన ప్రగతి చూస్తున్నారు. మహబూబాబాద్‌కు పరిశ్రమలు కూడా రావాలని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ కోరారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ లో కూడా రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడంలేదుపక్కన కర్ణాటక లో కూడా 24 గంటల కరెంటు హావిూ ఇచ్చి ఇప్పుడక్కడ పొలాలు ఎండబెడుతున్నారు
` మహబూబాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ వెల్లడి

తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను. ఇంత చేస్తే నీవు చేసింది సున్నా గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. ఎవరు ద్రోహం చేశారు. ఎవరికి ఎవరు నష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు తుమ్మల అన్యాయం చేసిండా..? బీఆర్‌ఎస్‌ తుమ్మలకు అన్యాయం చేసిందా..? ప్రజలే న్యాయం చెప్పాలి. విూ కండ్ల ముందు జరిగిన చరిత్ర. ఇవన్నీ మరిచిపోలేం. ఇవాళ నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడితే రాజకీయం కాదు. ప్రజాస్వామ్యం కాదు. అది అరాచకం. అరాచకాల్ని తిప్పికొట్టాలి.
` పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌
రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్‌ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు రైతు బంధు వద్దంటున్నారు.. 24 గంటల కరెంటు అవసరం లేదంటున్నారు.. అవసరమా వద్దా చెప్పండి.. రైతుబంధును పుట్టించిందే కేసిఆర్‌.. వచ్చే మార్చి తర్వాత 12 వేలు చేసుకుంటాం.. వచ్చే ఐదేళ్లలో 16 వేలకు పెంచుతామని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. అబద్దాలు విని మోస పోవద్దు.. ఆగమాగం కావద్దు .
` వర్థన్నపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

1.అభివృద్ధి జరగాలంటే భారాస మళ్లీ గెలవాలి
` అవకాశవాదులను దగ్గరకు రానివ్వకండి
` పూటకో పార్టీలు మారేవారిని అస్సలు నమ్మకండి
` ఓడిపోయినా మంత్రి పదవిస్తే తుమ్మల చేసిందేమిటీ?
` సీతారామా ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో కరువుండదు
` రైతుబంధు పథకాన్ని ఎంఎస్‌ స్వామినాథనే ప్రశంసించారు
` గిరిజనులకు ‘వెయ్యి’ చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లేస్తారా?
` నయా అబద్ధాలతో కాంగ్రెస్‌ ప్రజల వద్దకొస్తోంది.. ఓట్లతో బుద్ధిచెప్పండి
` ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు
ఖమ్మం/మహబూబాబాద్‌/వరంగల్‌(జనంసాక్షి): మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై తొలిసారి సిఎం కెసిఆర్‌ విమర్శలు గుప్పించారు.తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను అని కేసీఆర్‌ తెలిపారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వర్‌ రావుకు తాను అన్యాయం చేశానని ప్రచారం చేస్తున్న తీరుపై పాలేరు సభలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖమ్మం జిల్లా విూద ఏకఛత్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశారని తుమ్మలపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఖమ్మంలో పువ్వాడ అజయ్‌పై ఓడిపోయాడు. ఓడిపోవడంతో ఇంట్లకు పోయి మూలన కూర్చున్నాడు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత స్నేహితం ఉందని, సీనియర్‌ నాయకులని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేశాను. ఆ తర్వాత పాలేరులో ఎమ్మెల్యే వెంకట్‌ రెడ్డి చనిపోయారు. ఆయన భార్యను పోటీలో పెట్టాలని అనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నా నియోజకవర్గం రిజర్వ్‌ అయింది. అవకాశం ఇస్తే పాలేరు సేవకు చేస్తా, కాపాడుకుంటాను అని చెప్తే ఉప ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి మేమంతా వచ్చి దండం పెడితే 42 వేల మెజార్టీతో గెలిపించారు. ఈ సత్యం విూకు తెలుసు. ఓట్లు వేసింది విూరే అని కేసీఆర్‌ తెలిపారు.నేను ఒక్కటే మాట అడుగుతున్నాను. మంత్రిని చేసి, ఎమ్మెల్సీని చేసి, ఎమ్మెల్యేను చేసి ఐదేండ్లు జిల్లా విూద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నీవు చేసింది సున్నా గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. ఎవరు ద్రోహం చేశారు. ఎవరికి ఎవరు నష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు తుమ్మల అన్యాయం చేసిండా..? బీఆర్‌ఎస్‌ తుమ్మలకు అన్యాయం చేసిందా..? న్యాయం చెప్పాలింది విూరే అంటూ ప్రశ్నించారు. ఈ చరిత్ర అంతా విూ కండ్ల ముందు జరిగిన చరిత్ర. ఇవన్నీ మరిచిపోలేం. ఇవాళ నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడితే రాజకీయం కాదు. ప్రజాస్వామ్యం కాదు. అది అరాచకం. అరాచకాల్ని తిప్పికొట్టాలన్నారు. అరాచక రాజకీయవేత్తలకు బుద్ది చెప్పాలని కేసీఆర్‌ పాలేరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే పాలేరు నియోజకవర్గానికి మోక్షం లభించిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఖమ్మంలో రెండు సార్లు ఒక్కొక్క సీటే వచ్చింది. అయినా బీఆర్‌ఎస వచ్చింది. ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ వస్తది. ఎవడో ఎల్లయ్య, మల్లయ్య గెలిస్తే అయ్యేది ఏం లేదు. అదే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిస్తే జిల్లా అభివృద్ధికి, సీతారామ ప్రాజెక్టు కోసం పాటుపడుతారు అని కేసీఆర్‌ తెలిపారు. నిన్నమొన్నటి దాకా కేసీఆర్‌ వల్ల మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు.. నరం లేని నాలుక కాబట్టి వారే ఉల్టా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుక మారొచ్చు కానీ సత్యం మారదు. నిజం నిజం లాగే ఉంటుంది. నిజం నిప్పులాంటింది కదా..? ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో విూకు అందరికీ తెలుసు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం 24 ఏండ్ల క్రితం ఈ జెండా ఎత్తి, ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించు కున్నాం అని కేసీఆర్‌ తెలిపారు. ఉద్యమ ప్రారంభంలో చాలా అవమానాలు, అవహేళన చేశారు. తెలంగాణ ఎట్ల వస్తది.. సాధ్యం కాదు.. కేసీఆర్‌ బక్క పలచనోడు ఎవడో పిసికి చంపేస్తడు అని మాట్లాడారు. కానీ 14. 15 ఏండ్లు పోరాటం తర్వాత యావత్‌ తెలంగాణ ఒక ఉప్పెన అయి కదిలేతే దేశ రాజకీయ పరిస్థితి తలవంచి తెలంగాణ ఇచ్చింది అని కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తే ఆ రోజు నేనే కేసీఆర్‌ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా.. అని ఆమరణ దీక్ష చేపట్టాను అని కేసీఆర్‌ తెలిపారు. ఆమరణ దీక్షకు పూనుకుంటే తనను అరెస్టు చేసి ఇదే ఖమ్మం జైల్లో పెట్టారు. అనేక మోసాలు చేశారు. మాటలతో నమ్మించారు. అన్నింటిని అధిగమించి అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం అని సీఎం స్పష్టం చేశారు. భక్తరామదాసు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభం చేసిన రోజు మన మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి.. ప్రత్యేకించి ఆయన వచ్చారు. పాలేరుకు విూరు ఎందుకు వస్తున్నారంటే నాది కూడా పాలేరు నియోజకవర్గమే.. 45 ఏండ్లలో 40 ఏండ్లు కరువుకాటకాలకు గురైంది. ఇవాళ విూరు నీళ్లు అందిస్తున్నారు. సంతోషమైందని వచ్చానని మహేందర్‌ రెడ్డి తెలిపారని కేసీఆర్‌ గుర్తు చేశారు.విూ అందర్నీ కోరేది ఒక్కటే మాట. బీఆర్‌ఎస్‌ రాక ముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేశాయి అని కేసీఆర్‌ తెలిపారు. కొన్ని మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. పాలేరుకు మోక్షం లభించందంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. భక్తరామదాసు పూర్తి చేసి నీళ్లు ఇచ్చాం. ఈ విషయం విూ అందరికీ తెలుసు. వాగుల విూద చెక్‌ డ్యాంలు కట్టుకున్నాం. ఎండిపోయిన పాలేరు చెరువులు నిండుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఉపేందర్‌ రెడ్డి ఉపన్యాసం విన్నాను అని కేసీఆర్‌ తెలిపారు. అది ఉపన్యాసం లాగా లేదు. ఇంటి మనషులతో మాట్లాడినట్లు ఉంది. నా సెల్‌ ఫోన్‌ నంబర్‌ విూ దగ్గర ఉందా? అని అడిగారు. ఇది నాయకత్వ లక్షణం. ప్రజల్లో కలిసిపోయి మాట్లాడే నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఉపేందర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా విూకు ఉండటం అదృష్టం అని కేసీఆర్‌ అన్నారు.  గిరిజనులపై నోరు పారేసుకున్న టీ పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. గిరిజనులకు వెయ్యి నోటు చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారా..? ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే మర్యాద అని కేసీఆర్‌ ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. బెల్లయ్య నాయక్‌కు ఎమ్మెల్యే టికెట్‌ రావాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వాళ్లు పోరాటం చేస్తుంటే.. వాళ్లది ఏంది.. వెయ్యి నోటు చేతిలో పెట్టి ఇంత గుడుంబా పోస్తే వాళ్లే ఓటు వేస్తారు అని రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే మర్యాద. గిరిజనులకు గుడుంబా పోసి ఓట్లు తీసుకుంటారా..? ఇంత బాహాటంగా మాట్లాడుతారా..? ఇంత అహకారంతోని మాట్లాడే పార్టీ రేపు ఎవరికి న్యాయం చేస్తది. కాబట్టి ఆలోచించాలని కోరుతున్నానని గిరిజనులకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వందకు వంద శాతం రైతుబంధు కొనసాగిస్తాం అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన రీతిలో రైతుబంధు వచ్చే ఏడాది నుంచి రూ. 12 వేలు ఇస్తాం. క్రమంగా రూ. 16 వేలకు పెంచుతాం. ధాన్యం కొనుగోలు కొనసాగిస్తాం. రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తాం. రైతుబీమా తరహాలోనే 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకాలను తీసుకువస్తున్నాం. ప్రజల విూద భారం పడకూడదని గ్యాస్‌ సిలిండర్‌ను 400కే అందించాలని నిర్ణయించాం. ఇవన్నీ జరగాలంటే బీఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలవాలి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కచ్చితంగా వస్తదన్న ధీమా వ్యక్తం చేశారు..
ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ, అందులో ప్రజలే గెలవాలి
ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ, అందులో ప్రజలే గెలవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. మాయ చేసేవారిని గెలిపించవద్దని కోరారు. గత రెండు దఫాలుగా ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ను గెలిపించుకున్నారని, అద్భుతమైన ప్రగతి చూస్తున్నారని అన్నారు. మహబూబాబాద్‌కు పరిశ్రమలు కూడా రావాలని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ కోరారని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ లో కూడా రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదని అన్నారు. పక్కన కర్ణాటక లో కూడా 24 గంటల కరెంటు హావిూ ఇచ్చి ఇప్పుడక్కడ పొలాలు ఎండబెడుతున్నారని విమర్శించారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్‌ నాయక్‌ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ధరణి తీసేసి బంగాళాఖాతం లో విసిరేస్తామని రాహుల్‌ గాంధీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారని గుర్తు చేశారు.బంగాళాఖాతం లో వేస్తామన్న వారినే తీసి బంగాళాఖాతంలో వేస్తామని అన్నారు. ధరణి వల్ల రైతు బంధు, రైతు బీమా డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయని అన్నారు. పోడు సాగుదారులు అందరికీ పట్టాలు ఇచ్చామని, గతంలో వారిపై నమోదు చేసిన కేసులు మొత్తాన్ని మాఫీ చేశామని చెప్పారు. పోడు పట్టాలు ఇవ్వడమే కాకుండా, వారికి రైతు బంధు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చింది కాబట్టి మహబూబాబాద్‌ జిల్లా అయింది. పట్టుబట్టి జిల్లా చేయించిన. అభివృది ఫలితాలు కన్పిస్తున్నాయి. అకేరు, మున్నేరు నది పొడవునా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అద్భుతంగా పంటలు పండిస్తున్నారు. మహబూబాబాద్‌ లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నాయి. రెండు ఎలక్షన్లలో శంకర్‌ నాయక్‌ ను గెలిపించినందుకు అభివృద్దిని చూస్తున్నారు. విూ ఊర్లకు పోయి నేను చెప్పినదాన్ని చర్చించండి. నిజమేంటో తెలుసుకోండి. మాకు పరిశ్రమలు రావాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమ రావాలని కోరుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్‌ లో కూడా 24 గంటల కరెంటు సరఫరా లేదు. వాళ్లు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నరు. నాడు ఎరువుల కోసం చెప్పులు లెన్లులో పెట్టినం. నేడు పుష్కలంగా  ఎరువుల లభ్యం అవుతున్నాయి. ధాన్యం అమ్మితే నేరుగా బ్యాంకు ఖాతాలో జమయితా ఉన్నాయి. రైతు బందు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయి. ధరణితో లాభాలే ఉన్నాయి కానీ, నష్టాలు లేవు. విూ భూమి విూద విూకే అధికారం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టింది. ధరణి పోతే పైరవీ కారులు అధికారులు మళ్లా లంచాల వ్యవహారం మొదటికొస్తాయి. నేడు నేరుగా విూ ఖాతాల్లోకి వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వస్తే ఎటువంటి పైరవీలకు ఆస్కారం ఉండదు. పదేళ్ల నుంచి ప్రజారాజ్యం నడుస్తున్నది. 25 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చినం. పోలీస్‌ కేసులు రద్దు చేసినం. రైతుబంధు, భీమా కూడా ఇచ్చినం. మేం ఎలక్షన్ల పేరుతో అబద్ధాలు చెప్పం. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధును క్రమంగా 16 వేలు చేస్తాం. పెన్షన్లు కూడా పెంచుకుందాం, మహిళలకు 3 వేల రూపాయలు ఇస్తాం. విద్యాసంస్థలను కూడా  పెంచుతాం. తెలంగాణలో అద్భుతమైన అభివృద్ది జరిగింది. ఈ అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించండి. 60 ఏళ్లు మోసం చేసిన కాంగ్రెస్‌ నయా మోసం, నయా అబద్దాలు చెప్తుతూ మళ్లీ విూ ముందుకు వస్తుంది. దయచేసి వారికి ఓటు బుద్ధి చెప్పండి. ఇంత భారీ ఎత్తున తరలివచ్చిన జనాన్ని చూస్తే ఈ సభ ద్వారా బీఆర్‌ఎస్‌ గెలవబోతుందని రుజువయిందని కేసీఆర్‌ అన్నారు.
అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలి
వరంగల్‌ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం భట్టుపల్లిలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి ఉన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్‌ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్‌ తెలిపారు. అందరికీ న్యాయం చేసే విధంగా సంక్షేమ పథకాలతో ముందుకు కదిలాం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు చాలా మంది వచ్చి అవాక్కులు చెవాక్కులు చెబుతారు.. వారికి ఓట్లు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు.. కొంత మంది దుర్మార్గులు షార్ట్‌ కట్‌ లో రింగ్‌ రోడ్‌ ల్యాండ్‌ పూలింగ్‌ అని అబద్దాలు చెబుతారు.. రింగ్‌ రోడ్‌ ల్యాండ్‌ పూలింగ్‌ లేదు.. కాంగ్రెస్‌ నేతలు రైతు బంధు వద్దంటున్నారు.. వద్దంటున్న వారికి బుద్ది చెప్పాలి అని ఆయన కోరారు. మరో నాయకుడు అంటున్నాడు 24 గంటల కరెంటు అవసరం లేదంటున్నారు.. అవసరమా వద్దా చెప్పండి.. రైతుబంధును పుట్టించిందే కేసిఆర్‌.. వచ్చే మార్చి తర్వాత 12 వేలు చేసుకుంటాం.. వచ్చే ఐదేళ్లలో 16 వేలకు పెంచుతామని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. అబద్దాలు విని మోస పోవద్దు.. ఆగమాగం కావద్దు అని గులాబీ బాస్‌ కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ రాజ్యంలో ఎట్లా ఉండే.. మందు బస్తాలు దొరకలేదు.. కల్తీ విత్తనాలు ఉండే.. ధరణి తీసేస్తే రైతుబంధు రాదు.. రైతుబంధు సహాయం ప్రపంచంలో ఎక్కడ లేదు.. సంక్షేమ రాజ్యంగా ముందుకు పోతున్నాం.. గ్రేటర్‌ వరంగల్‌ లో విలీనమైన 40 గ్రామాలకు ప్రత్యేకంగా ఫండ్స్‌ ఇస్తానంటూ కేసీఆర్‌ వెల్లడిరచారు.ర్ధన్నపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆరూరి రమేశ్‌ మెజార్టీ తన మెజార్టీ కంటే ఎక్కువ రావాలన్నారు కేసీఆర్‌. ఆరూరి రమేశ్‌ను గెలిపిస్తరని ఈ సభను చూస్తుంటే రుజువైపోయింది అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున కదిలివచ్చారంటేనే.. అర్థమైపోతుంది. ప్రజల్లో ఉండే మంచి నాయకుడు ఆరూరి రమేశ్‌ అని. గత రెండు ఎన్నికల్లో ఒకసారి 80 వేలు, ఇంకోసారి 90 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారు. రమేశ్‌ మెజార్టీ నా కంటే ఎక్కువ రావాలి. లక్ష మెజార్టీ రావాలని కోరుతున్నాను అని కేసీఆర్‌ అన్నారు. వరంగల్‌ పట్టణంతో వర్ధన్నపేట కలిసిపోయింది అని కేసీఆర్‌ తెలిపారు. దాదాపు 40 గ్రామాలను వరగంల్‌ పట్టణంలో విలీనం చేశారు. ఎన్నికల తర్వాత ఆ గ్రామాల ప్రజలకు సాదా బైనామాకు అవకాశం కల్పిస్తాం. ఈ గ్రామాలకు ప్రత్యేక ఫండ్‌ మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా, ఉద్యోగ కల్పనలో ముందుకు తీసుకుపోతాం. ఈ అభివృద్ధిని కొనసాగించాలని కోరుతున్నా. ప్రజల మనిషిగా ఉన్న ఆరూరి రమేశ్‌ను మళ్లీ గెలిపించాలని కోరుతున్నా. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కడియం శ్రీహరి ఇద్దరూ ఈ వర్ధన్నపేటకు చెందినవారే. వారి ఆశీస్సులు కూడా రమేశ్‌కు ఉంటాయి. అందరూ కలిసి వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని కోరుతున్నానని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సంసారాన్ని చక్కదిద్దకుకున్నట్టు ఒక్కో పనిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం అని కేసీఆర్‌ తెలిపారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలను కాపాడుకుంటున్నాం. ఏ కులాన్ని, వర్గాన్ని వదిలిపెట్టకుండా.. అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు పోయాం. కరెంట్‌, సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

తాజావార్తలు