మారిందన్నావు..ఎక్కడ మారింది?
ధరలు తగ్గలేదు పెరిగాయి
మోది సర్కారుపై
గులాంనబీ ఆజాద్ ఫైర
హైదరాబాద్,మే29(జనంసాక్షి):
మోడీ ఏడాది పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. మోడీ ప్రజలకు రాసిన లేఖలో అన్ని అబద్ధాలే పేర్కొన్నారని దుయ్యబట్టారు.ఎన్డీఏ ఏడాది పాలనలో ఎన్నో మరకలు ఉన్నాయని ఆజాద్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరాభవన్ లో ఆయన విూడియాతో మాట్లాడారు. మోడీ ఇచ్చిన హావిూలేవీ నెరవేర్చలేదని విమర్శించారు. ధరలు తగ్గాయని మోడీ చెబుతున్నది నిజం కాదని… దేశ వృద్ధి రేటు మందగిస్తోందని తెలిపారు. ఏడాది పాలనలో గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఫైర్ అయ్యారు. రైల్వే ప్రయాణ ఛార్జీలు, సరుకు రవాణా ఛార్జీలు పెంచారని చెప్పారు. అంతర్జాతీయంగా పెట్రోల్ రేట్లు తగ్గినా మనకు మాత్రం తగ్గడం లేదన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ పెద్దలపై అలిగిన విషయం విదితమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వలేదని దానం అధిష్టాన పెద్దలపై రుసరుసలాడారు. ఈ క్రమంలో దానంను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు యత్నిస్తున్నారు. దానం నివాసానికి గులాం నబీ ఆజాద్, వయలార్ రవి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ వెళ్లారు. జూన్ 1న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దానంను ఆ పార్టీ నేతలు బుజ్జగించారు. కాంగ్రెస్ నుంచి ఆకుల లలితకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించిన విషయం విదితమే.దీనిపై అలిగిన దానం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.