మారిన్ చేతిలో సైనా ఓటమి
– మలేషియా ఓపెన్ నుంచి నిష్కమ్రణ
కౌలాలంపూర్, జనవరి19(జనంసాక్షి) : మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సెవిూ ఫైనల్‌లో 16-21, 13-21 తేడాతో కరోలినా మారిన్ చేతిలో ఓడిన సైనా టోర్నీ నుంచి నిష్కమ్రించింది. ఏడో సీడ్‌గా బరిలో దిగిన సైనా.. 21-18, 23-21 తేడాతో జపాన్‌కు చెందిన రెండో సీడ్ నొజొమి ఒకుహరను ఓడించి సెవిూస్ చేరింది. క్వార్టర్స్‌లో అద్భుత ఆటతీరు కనబర్చిన సైనా.. సెవిూ ఫైనల్లో ఆస్థాయి ఆటతీరును కనబర్చలేకపోయింది. 16-21 తేడాతో తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా.. రెండో గేమ్‌లోనూ పుంజుకోలేక పోయింది. దూకుడుగా ఆడిన మారిన్ రెండో గేమ్‌ను కూడా 21-13 తేడాతో గెలుపొందింది. 40 నిమిషాలపాటు సాగిన పోరాటంలో.. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన మారిన్.. సైనాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ పదకొండుసార్లు తలపడగా.. సైనా ఐదుసార్లు విజయం సాధించింది. 2017లో మలేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా.. 2011లో రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో కొరియాకు చెందిన సాన్ వాన్ చేతిలో ఓడిన కిదాంబి శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్కమ్రించిన సంగతి తెలిసిందే.