మార్కెట్లలో దళారులను నమ్మొద్దు
ఆదిలాబాద్,అక్టోబర్25(జనంసాక్షి): రైతులు పండించిన పత్తి పంటను రోజు మార్కెట్‌లో నిర్ణయించిన ధర ప్రకారం నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. ఎవరు కూడా దళారులను ఆశ్రయించవద్దన్నారు. తేమశాతం మేరకు నడుచుకోవాలన్నారు. వ్యాపారుల కూడా రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్ యార్డులో నిర్ణయించిన ఆ రోజు ప్రకారం 8 శాతం తేమ ఉన్న పత్తికి ధర చెల్లిస్తారని, 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉన్న పత్తికి ఒక శాతం తేమకు ఒక కిలో ధర కోత విధించినప్పటికీ క్వింటాకు రూ.20 చొప్పున అదనంగా చెల్లిస్తారని అన్నారు. 13 శాతం నుంచి 20 శాతం వరకు తేమ ఉన్న పత్తికి పత్తి రెండు శాతం తేమకు ఒక కిలో ధర కోత విధించి చెల్లిస్తారని పేర్కొన్నారు. రైతులు 20 శాతం కన్నా ఎక్కువ తేమ ఉన్న పత్తిని మార్కెట్‌కు తీసుక రాకూడదని విజ్ఞప్తి చేశారు.