మార్కెట్స్ చట్ట సవరణ బిల్లు ఆమోదం
మార్కెట్స్ చట్ట సవరణ బిల్లు దేశానికే ఆదర్శమవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి హరీశ్ రావు తెలంగాణ మార్కెట్స్ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందిస్తూ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు తెలిపారు. సీఎం నిర్ణయంపై విపక్షాలు హర్షం వ్యక్తంచేశాయి. బిల్లుకు సభ ఆమోదం అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. వాకౌట్ చేయడమే ప్రతిపక్షం పనికాకూడదు. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ బిల్లు దేశానికే ఆదర్శమవుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ఇచ్చిన సూచనను సీఎం స్వీకరించారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. సీఎం నిర్ణయంపై విపక్షాలు సర్వత్రా హర్షం వ్యక్తం చేశాయి. సభ్యులు సీఎంపై ప్రశంసల జల్లు కురిపించారు.