మార్కెట్ లో పోటీ వీరిద్దరి మధ్యే

మార్కెట్ లో ఎవరెన్ని ఆఫర్లు గుమ్మరించినా… ఇదిగో తీసుకోండని మొత్తుకున్నా… పోటీ మాత్రం ఆ ఇద్దరి మధ్యే ఉంది. స్పీడ్ పెరిగిందని చెప్పినా.. జీబీ ప్యాకేజీలు పెంచినా.. నమ్మడం లేదు సరికదా… వాటివైపు కనీసం చూడటం లేదు. అయితే జియో లేదంటే ఎయిర్ టెల్. ఈ రెండింటి మధ్యే పోటీ నెలకొంది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.333/90 డేస్ ప్యాకేజ్ కూడా వీరి ప్యాకేజ్ ల ముందు దిగదుడుపే అయ్యింది. రిలయన్స్ జియో మంత్రం  జపిస్తున్నారు వినియోగదారులు. ఎంత జియో వచ్చినా.. సొంత కష్టమర్లు ఎయిర్ టెల్ ను వదిలిపోవడం లేదు.

ఉదాహరణకు BSNLనే తీసుకుందాం. ఈ సంస్థ ప్రకటించిన ప్యాకేజ్ లు.. ఇతర ఏ సంస్థకు తీసిపోని విధంగా ఉన్నాయి. అయినా ఆ రెండింటిని దాటిపోవడం లేదు కస్టమర్లు. BSNL ఇప్పటి వరకు మూడు ప్యాకేజ్ లు ప్రకటించింది. రూ.333/90 డేస్ ప్యాకేజ్ ప్రకటించిన BSNL.. రోజూ 3జీ స్పీడ్ తో 3జీబీ డేటా అందిస్తామన్నది దీని సారాంశం. అయితే కాల్స్, మెసేజ్ లకు డబ్బు చెల్లించాల్సిందే.

ఇలాంటిదే మరో ప్యాకేజ్ రూ.349/90 డేస్ ప్యాకేజ్. అయితే దీన్లో BSNL సొంత వినియోగదారులకు అన్ లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా అందిస్తోంది. రూ.395/71 డేస్ తో మరో ప్యాకేజ్ ప్రకటించింది.  BSNL నుంచి BSNL కు 3000 నిమిషాలు ఎస్టీడీ, లోకల్ కాల్స్ ఫ్రీగా అందించనుంది. BSNL నుంచి ఇతర వినియోగదారులకు 1800 నిమిషాలు ఫ్రీగా అందించనుంది.

ఇన్ని ఆఫర్లు ప్రకటించినా… BSNL వైపు మరలకపోవడానికి ప్రధాన కారణం.. నెట్ వర్క్ సరిగ్గా లేకపోవడమే అంటున్నారు టెలికాం రంగ నిపుణులు. స్పీడ్ నెట్ వర్క్ అందిస్తే… ఈ పరిస్థితి ఉండదని అంటున్నారు. 3జీ స్పీడ్ అందిస్తామని పైకి చెబుతున్నా.. 2జీ స్పీడ్ తోనే బండి లాగిస్తున్నారని.. అందుకే.. వినియోగదారులు BSNLను పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. ఎయిర్ టెల్, జియోలే అన్నింటా ముందుంటున్నాయని.. డేటా ప్లాన్ లతో వొడాఫోన్ మూడో స్థానంతో సరిపెట్టుకుందంటున్నారు.