మార్చిలోగా మరుగుదొడ్లు పూర్తి కావాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): మార్చిలోపు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని, అందుకు గాను ఈజీఎస్‌ అధికారులు కృషి చేయాలని అధికారులు సూచించారు. కేంద్రం నుంచి
విడుదలవుతున్న స్వచ్ఛభారత మిషన కింద నిర్మాణం జరుగుతున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్రం నుంచి రూ.12వేలు అందుతాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లు లేని వారికి వెంటనే మంజూరు చేసి నిర్మించుకునే విధంగా అవగాహన కల్పించారు. మార్చి నెలాఖరులోగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండి తీరాల్సిందేనని, దీనిపై ఈజీఎస్‌ అధికారులు ఎంపీడీవో పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన కృషి చేయాలన్నారు.