మార్చ్‌లో తెలంగాణ ఉద్యోగులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించండి
అవసరమైతే మరోమారు సకలజనుల సమ్మెకు సిద్ధం
తెలంగాణ ఉద్యోగుల సంఘం
జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైక దేవీప్రసాద్
హైద్రాబాద్, సెప్టెంబర్ 11(జనంసాక్షి):
సెప్టెంబర్ 30న జరగనున్న తెలంగాణ మార్చ్‌లో తెలంగాణ ఉద్యోగులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా జరుగుతున్న ఆ మార్చ్‌కు ఉద్యోగ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. సకలజనుల సమ్మె ప్రారంభమైన సెప్గెంబర్13న పునరంకిత దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు..ఈ సందర్భంగా కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని దీని కోసం అవసరమైతే మరోసారి సకల జనుల సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు..ఈ నెల 22న ఆర్డీవో ఆఫీసులు మొదలుకొని..సచివాలయం దాకా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం జరిగిన తెలంగాణ ఉద్యోగుల సమావేశంలో 100కి పైగా ఉద్యోగ సంఘాలు పాల్గొని ఆయనను తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..ఈ సందర్భంగా ఆయనను పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు…ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, వెంకటస్వామి, జ్ఞానేశ్వర్, కత్తి వెంకటస్వామి, వెంకటపతి రాజు, రేచల్, మమత, అన్ని జేఏసీలకు చెందిన చైర్మన్‌లు, కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు..