మార్పు రానంతవరకు ఇతర ప్రయత్నాలన్నీ వృధా: ప్రధాని మోదీ
న్యూదిల్లీ: మన జీవన విధానంలో మార్పు వస్తే మిగతావీ మారతాయని, ఆ మార్పు రానంతవరకు ఇతర ప్రయత్నాలన్నీ వృధానేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భూతాపం-కార్బన ఉద్గారాలపై సోమవారం దిల్లీలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా 10నగరాల్లోని జాతీయ వాయుకాలుష్య సూచీలను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం అతితక్కువ కార్బన ఉద్గారాలు విడుదల చేస్తోందని, పర్యావరణ పరిరక్షణలో భారత్ కృషిని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. వస్తువుల దుర్వినియోగం అనేది దేశంలో అనాది నుంచి ఉన్నదేనని, వస్తువుల పునర్వినియోగం మన ఇళ్లల్లో సంప్రదాయం వస్తోందన్నారు. భూసేకరణ బిల్లుపై, గిరిజనుల, అటవీ భూముల విషయంలో అసత్య ఆరోపణలకు స్వస్తి పలకాలన్నారు. సౌర, పవన విద్యుత్‌లో ప్రత్యేక చొరవ చూపిస్తున్నామని మోదీ తెలిపారు.