మాలిపై ఐరాస భద్రతా మండలి తీర్మానం

 

న్యూయార్క్‌: పశ్చిమ ఆఫ్రిక దేశమైన మాలిలో ప్రజాస్వామ్య పునరుద్గరణకు చర్యలు చేపట్టనున్నట్టు ఐరాస భద్రతామండలి ప్రకటించింది. మాలికి అఫ్రిక శాంతి దళాలను పంపేందుకు ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతామండలి ఈమోదించింది. ఈ ఏడాది మార్చి 22న మాలిలో సైనిక తిరుగుబాటు జరగడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇస్లామిక్‌ తీవ్రవాదులు అధికారాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. తీవ్రవాదుల భయంతో వేలాదిమంది. ప్రజలు పోరుగుదేశాలకు వలసబాట పట్టారు. మాలిలో సుస్థిరత నెలకొల్పేందుకు ప్రతిపాదించిన దళాలను పంపించాలన్న తీర్మాణానికి ఆమోదముద్ర పడటంలో దేశంలో సుస్థిరత నెలకొంటుందని మాలి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.