మాల మహానాడు ఆధ్వర్యంలో బియ్యం వితరణ.

 

బూర్గంపహాడ్ ఆగష్ఠ్ 25(జనంసాక్షిి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్
మండల పరిధిలోని మొరంపల్లి బంజరు గ్రామం నిరుపేద శశికళ కుటుంబానికి జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ ఆధ్వర్యంలో క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ మాట్లాడుతూ స్వచ్ఛంద దాతల సహకారంతో ఈ బియ్యాన్ని అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలు గోవింద్, నవీన్, బాలకృష్ణ, అశోక్, రవీందర్, రామిరెడ్డి, లక్ష్మణరావు కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తము స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, పుట్టి నరసింహారావు, జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా నాయకురాలు బోడ దివ్య , జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.