మాస్కోసముద్రంలో 54 మంది జల సమాధి

54 మంది జల సమాధి
 మాస్కో: సముద్రంలో వెళుతున్న నౌక ఒకటి మునిగిపోయి 54 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. సముద్రంలో దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలు ఢీకొనడంవల్లే ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తోంది. దక్షిణ మగదాన్కు 250 కిలో  మీటర్ల దూరంలో ఉన్న కామ్చట్కా తీరంలో ది దాల్ని వోస్తోక్ అనే నౌకలో మొత్తం 132 మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు మంగళవారం రాత్రి తర్వాత మునిగిపోవడంతో అధిక ప్రాణనష్టం జరిగింది. 63 మందిని సహాయక సిబ్బంది కాపాడగా మరో 15 మంది గల్లంతయ్యారు.  అయితే, ఈ నౌకలో ఉన్నవాళ్లలో 78 మంది రష్యన్లుకాగా 40 మంది మయన్మార్, మిగితావారు ఉక్రెయిన్, లిథువానియా, వాంచూ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు రష్యా ప్రభుత్వ అధికారులు తెలిపారు.