మా గుట్టలు మాకేనని మర్లపడ్డ నామాపూర్‌

సిరిసిల్ల, 26 జూలై (జనంసాక్షి) : తెలంగాణలోని ఖనిజ సంపదపై సీమాంధ్రులు కన్నువేశారు.  కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల డివిజన్‌లోని ముస్తా బాద్‌ మండలంలో నామాపూర్‌, గూడూరు గ్రామా ల సరిహద్దులో గల పల్లగుట్టలో 2009లో అధికా రులు సర్వే చేసి రంగురాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ గుట్టను ఎలాగైన సొంతం చేసుకోవాలని సీమాంధ్రకు చెందిన కొందరు వ్యక్తులు తెలంగాణ వాసిని బినామీల పేరుతో టెండర్‌లు వేసి 64.76 ఎకరాల పల్లగుట్ట లీజ్‌ అనుమతి పొందారు. ఈ విషయంపై ప్రజాభిప్రాయసేకరణకు గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ సుందర్‌అబ్నర్‌, పీసీసీబీ ఎగ్జ్యూటివ్‌ ఇంజినీరు శంకర్‌నాయక్‌ నామాపూర్‌, గూడూరు గ్రామస్తుల అభిప్రాయసేకరణ చేశారు. పురాతన కాలం నుంచి ఈ గుట్టను నమ్ముకునే తాము జీవిస్తున్నామని ఈ గుట్టపై దర్గా ఉందని ప్రతి సంవత్సరం గ్రామస్తులమంతా పండుగ వేడు కలు జరుపుకుంటామని ఆలాంటి పల్లగుట్ట తవ్వ కాలు జరుపవద్దని గ్రామస్తులు తమ అభిప్రాయా న్ని అధికారులకు తెలిపారు.

గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పెద్ద ఎత్తున్న పోలీసుబలగాలు మోహరించాయి. ప్రజల అభిప్రాయం మేరకే కాలుష్య నియంత్రణ మండలి కి నివేదిక ఇస్తామని పల్లగుట్ట తవ్వకాల గురించి ప్రభుత్వమే నిర్ణయిస్తుందని అధికారులు పెర్కోన్నా రు. ఈ ప్రజాభిప్రాయసేకరణలో ఎంపీడీవో బండి సుధాకర్‌, తహశీల్దార్‌ రాజమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

పల్లగుట్ట తవ్వకాలు జరుపవద్దంటూ

అరుణోదయ కళాకారుల ప్రచారం…

ఈ నెల 20 నుంచి పల్లగుట్ట తవ్వకాలు చేపట్ట వద్దు తెలంగాణ ఖనిజసంపదను కొల్లగొట్టవ ద్దంటూ అరుణోదయ కళాకారుల బృందం ముస్తా బాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మం డలాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తూ గ్రామస్తుల ను చైతన్యవంతం చేశారు. పల్లగుట్టను తవ్వితే వాటిద్వారా విడుదలయ్యే రసాయనపదార్థాలు చూ ట్టు ప్రక్కల గ్రామాలకు విస్తరించి ప్రజలు ఏరకంగా అనారోగ్యానికి గురవుతారో వారికి వివ రించారు. గురువారం గ్రామస్తులంతా ముక్త కంఠంతో పల్లగుట్టను తవ్వద్దంటూ  అధికారులకు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో అధికా రులు వెనుదిరిగారు.