*మా దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వం
చరిత్ర వక్రీకరిస్తే ఖబర్దార్
* మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా కరీంనగర్ విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ భారతదేశం అనేక జాతులు,కులాలు మతాలసమైక్యతో ఉందని ఈ దేశాన్ని విభజించి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని బిజెపి ప్రయత్నం చేస్తుందని మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని అన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని బిజెపి దేశభక్తులమని గొప్పలు చెప్పుకుంటుందని,వీర తెలంగాణ సాయిధరైతంగా పోరాటాన్ని వక్రీకరించి సాయుధ పోరాటంలో పాల్గొనని బిజెపి, తెలంగాణ విమోచన దినం పేరిట హిందూ ముస్లింల గొడవలుగా చరిత్రను వక్రీకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వీర తెలంగాణ పోరాటంలో పాల్గొన్న షోయబుల్లాఖాన్, తో పాటు అనేకమంది హిందూ ముస్లింలు పాల్గొన్నారనీ గుర్తు చేశారు. ఈ దేశ ప్రజలను చిత్రహింసలు పెట్టిన కాసిం కాసిం రజ్వి, నైజాం నవాబును సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ జైల్లో పెట్టలేదని పైగా వారికి పట్టాభిషేకం కడుతూ రాచ మర్యాదలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాజంలో కుల దురహంకార తెగులు ఉన్నాయని పరువు హత్యలు జరుగుతున్నాయని వీటన్నిటి పైన ప్రజలను చైతన్యం చేస్తూ ఎస్ఎఫ్ఐ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం వచ్చేవరకు ఎస్ఎఫ్ఐ రాజీలేని పోరాటాలు నిర్వహించాలని, ఎస్ఎఫ్ఐ అన్ని అంశాల పైన అవగాహన కలిగి ఉండాలని నిరంతరం అధ్యయనం చేయాలని అన్నారు.
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జీవన భద్రత లేదని శ్రమదోపిడి ఎక్కువైందని కేవలం అదాని, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని అన్నారు. కోవిడ్ తర్వాత విద్యా వ్యవస్థ అతులకుతలం అయిందని విద్యారంగం తీవ్ర సంక్షోభం అసమానతలతో కూరుకుపోయిందని అన్ని రంగాల అసమానతలను జయించాలంటే విద్యనే ప్రదానం అన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐక్యంగా ఉన్న హిందూ ముస్లింలను కాశ్మీర్ పై రజాకార్ల ఫైలు అంటూ చరిత్రను వక్రీకరించే సినిమాలను ప్రోత్సహించి, సమాజాన్ని విభజించి పాలించాలని చూస్తుందని అన్నారు.
ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఎమ్మెల్యేలను బిజెపి పార్టీ సంతలో సరుకుల వలే కొనుగోలు చేస్తూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు,వి.పిసాను, మాయుక్ భిశ్వాస్,రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామ్మూర్తి,నాగరాజ్, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రజనీకాంత్,శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి,గర్ల్స్ కన్వీనర్ ఎం.పూజ, తదితరులు పాల్గొన్నారు